విద్యార్థుల తల్లిదండ్రులు బండి సంజయ్ ఫై కేసు పెట్టాలి

విద్యార్థుల తల్లిదండ్రులు బండి సంజయ్ ఫై కేసు పెట్టాలి
  • ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే బిజెపి లక్ష్యం
  • పతకం ప్రకారమే 10వ తరగతి పేపర్ లీకేజీ 
  • ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, యువత, విద్యార్థులు ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నారని విద్యార్థులు, నిరుద్యోగులు బిజెపికి దూరమవుతున్నారన్న ద్వేషంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నాపత్రాలను లీకు చేయిస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని పదో తరగతి  పేపర్ లీకేజీ కేవలం బిజెపి చేసిన కుట్రనేననీ జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ పై కేసులు పెట్టాలని అప్పుడే ఇలాంటి కుట్రలు మరోసారి జరగవని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచడమే లక్ష్యంగా బిజెపి పార్టీ కుట్రలకు తెరలేపిందన్నారు.

గ్రూప్ వన్ పరీక్షా పత్రాన్ని లీకు చెందిన రాజశేఖర్ రెడ్డి బిజెపి ముఖ్య కార్యకర్త అని, నిరుద్యోగులను, విద్యార్థులను ప్రభుత్వానికి దూరం చేయాలన్న లక్ష్యంతో బండి సంజయ్ ప్రశ్నపత్రాల లికేజీకి కుట్ర పన్నాడన్నారు. కమలాపూర్లో మైనర్ బాలుర సహకారంతో పరీక్ష ప్రారంభం అయ్యిన తరువాత పేపర్ ను ప్రశాంత్ అనే వ్యక్తి బయటకు తెచ్చి బండి సంజయ్ కు పంపిస్తే సోషల్ మీడియాలో వైరల్ చేశారన్నారు. పేపర్ల లీకేజీ లో బిజెపి అనుబంధ ఉపాధ్యాయ సంఘాల పాత్ర కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.  బిజెపి పార్టీ నైతిక విలువలకు తిలోదకాలిచ్చి కేవలం రాజకీయ లబ్ధికోసం విద్యార్థుల, నిరుద్యుగుల జీవితాలతో అడుకొంటుందని, తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ఆశిస్తే మీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప ఇలా లికేజిలకు పాల్పడి విద్యార్థుల, యువత జీవితాలతో అడుకోవద్దనని హితవు పలికారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీల కు ఓవైపు పాల్పడుతూనే మరోవైవు బండి సంజయ్ అమాయకుడిలా ప్రభుత్వ అక్రమ అరెస్టులు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు, దుర్మార్గపు ఆలోచనలు గతంలో లేవని ఇవన్నీ మానుకోవాలని బిజెపి నాయకులను కోరారు.

బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం 
జగిత్యాల పట్టణ, మండల బి అర్ ఎస్ పార్టీ అధ్వర్యంలో పేపర్ లికేజి నిరసిస్తూ బిఆర్ ఎస్ నాయకులు పట్టణంలోని తహాసిల్ చౌరస్తాలో  బిజెపి అనుబంధ సంఘాల నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు బండి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, నాయకులు బాల ముకుందం, నక్కల రవీందర్ రెడ్డి,బాలే శంకర్,ఆల్లాల ఆనంద్ రావు,వోల్లెం మల్లేశం,ధుమల రాజ్ కుమార్,సందీప్ రావు, పిట్ట ధర్మరాజు, కూతురు రాజేష్, పంబాల రామ్ కుమార్, ఆడువల లక్ష్మన్, నారాయణ రెడ్డి, గంగారాం, రాగుల రాజు, అడేపు సత్యం, అసిఫ్, ఆనంద్ రావు, అలిశెట్టి వేణు, శరత్ రావు, రంగు మహేష్, ప్రశాంత్ రావు, శంకర్, ఆరిఫ్, పవన్ గౌడ్, తిరుపతి, సుమన్, రాజు, శ్రీనివాస్, క్రాంతి, అజీజ్, ముఖేష్ ఖన్నా, మోహన్, నక్క గంగాధర్, రమేష్, సుంకే మహేష్, సంగెపు మహేష్, రాము, అనిల్, భగవాన్ రాజ్, సుంకే మహేష్, ప్రశాంత్, తాజొద్దిన్న్, నారాయణ, మల్లారెడ్డి, కూతురు శేకర్, కోటేశ్వర రావు, రామకృష్ణ,పవన్, సురేందర్, భుమన్న, పుల్ల మల్లయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.