ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చాలి

ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చాలి

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లాలని రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిర్మల్ పట్టణంలో జరగనున్న ఆత్మీయ సమ్మేళనాలపై బిఆర్ఎస్ నేతలతో పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో సన్నాహక సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈనెల 7 నుండి పట్టణంలో జరగనున్న ఆత్మీయ సమ్మేళనం కార్యాచరణ విషయమై పలు విషయాలను కార్యకర్తలకు సూచించారు. ఆత్మీయ సమ్మేళనానికి కార్యకర్తలంతా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.