తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

జనగామ (కొడకండ్ల), ముద్ర: జనగామ (కొడకండ్ల), ముద్ర : అకాల వడగండ్ల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ కొడకొండ్ల మండల అధ్యక్షుడు సురేష్ నాయక్  డిమాండ్ చేశారు. మండలంలోని నర్సింగాపురం గ్రామంలో కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పార్టీ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఆత్మీయ సమ్మేళనాల నిర్వహించడం తప్ప రైతులు పడుతున్న కష్టాలు వారికి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సుమారు రూ.1000 కోట్లతో సచివాలయాన్ని కట్టిన ప్రభుత్వం ప్రభుత్వానికి రైతులకు ధాన్యాన్ని కాపాడుకున్నందుకు తాడిపత్రిని అందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ నరసయ్య పట్టణ అధ్యక్షులు రవీందర్, గ్రామ పార్టీ అధ్యక్షులు రంగయ్య, మండల ప్రధాన కార్యదర్శి అంజయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాహుల్ నాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షులు కలీం, బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్  తదితరులు పాల్గొన్నారు.