పశు వైద్యశాలా ? పార్కింగా ?

పశు వైద్యశాలా ? పార్కింగా ?

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో ఉన్న పశువైద్యశాల స్థలాన్ని గ్రామపంచాయతీ వినియోగించుకోవడంతో అది గ్రామీణ పశు వైద్యశాలా? లేదా పార్కింగ్ స్థలమా? అని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... డివిజన్ కేంద్రంలోని గ్రామపంచాయతీ భవనాన్ని ఆనుకుని పశు వైద్యశాల ఉంది. గ్రామ నడిబొడ్డున పశు వైద్యశాల ఉండడంతో పాడి రైతులు తమ పశువులకి టీకాలు, శస్త్ర చికిత్సలు చేయించేందుకు అనువుగా ఉంది. అయితే మేజర్ గ్రామపంచాయతీ కావడం వాహనాలతోపాటు సభలు సమావేశాలు నిర్వహించడానికి ప్రస్తుత గ్రామపంచాయతీ ముందున్న స్థలం సరిపోక పశువైద్యశాల స్థలాన్ని గ్రామపంచాయతీ వినియోగించుకుంటుంది.

పశు వైద్యశాలని మరో చోటికి మార్చి ఆ స్థలాన్ని గ్రామపంచాయతీ స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో జిపి పాలకమండలికి ఉంది. అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా హాస్పిటల్ ముందు గ్రామపంచాయతి ట్రాక్టర్లు, చెత్త బండ్లు, ట్యాంకర్లు పార్కింగ్ చేయడంతో ఇది పశు వైద్యశాలా?  లేక పార్కింగ్ స్థలమా?  పాడి రైతుల ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా  పశు,వైద్యధికారులు స్పందించి హాస్పిటల్ ను పరిశుభ్రంగా ఉంచాలని లేకుంటే గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మండలం అధ్యక్షులు మేకల మల్లేష్ హెచ్చరించారు.