‘రంజాన్‌’ను ఘనంగా నిర్వహించాలి

‘రంజాన్‌’ను ఘనంగా నిర్వహించాలి

జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య
ముద్ర ప్రతినిధి, జనగామ: రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించాలని జనగామ కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య జిల్లా అధికారులు, నియోజకవర్గ నోడల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో రంజాన్‌ కానుకల పంపిణీ, ఇఫ్తార్ విందు వంటి కార్యక్రమాలపై ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 4 వేల రంజాన్ కానుకలు వచ్చాయని, జనగామ నియోజక వర్గానికి 1,500, స్టేషన్ ఘన్‌ పూర్ నియోజకవర్గానికి 1,500, పాలకుర్తి నియోజకవర్గానికి  వెయ్యి కేటాయించామని తెలిపారు.

వీటిని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిదులతో చర్చించి పంపిణీ చేయాలని సూచించారు. ముస్లిం పెద్దలు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి అధికారులకు సహకరిస్తూ నిరుపేదలకు ఈ కానుకలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్తార్ నిర్వహణకు జనగామ రూ3 లక్షలు, స్టేషన్ ఘన్‌ పూర్‌‌కు రూ.3, పాలకుర్తికి రూ.2 లక్షలు కేటాయించామని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా మైనారిటీ అధికారి సయ్యద్ ఇస్మాయిల్, జనగామ, పాలకుర్తి తహసీల్దార్లు జి.రాంరెడ్డి, కృష్ణవేణి, మండల ప్రత్యేక అధికారులు, ముస్లిం మత పెద్దలు మహమ్మద్ సమద్, మసీహుర్ రెహమాన్‌ జాకీర్, మహమ్మద్ షకీల్, ఆతర్, మహమ్మద్ అజీం పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి దరఖాస్తు స్వీకరించారు. మొత్తం వివిధ శాఖ సంబంధించి మొత్తం 52 దరఖాస్తులు రాగా అందులో 33 రెవెన్యూ శాఖవే ఉన్నాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి మన్సూరి పాల్గొన్నారు.

దొడ్డి కొమురయ్య ఘన నివాళి
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం తరుఫున కలెక్టర్ శివలింగయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి.రవీందర్, సీపీవో ఇస్మాయిల్, షెడ్యుల్ కులాల ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మెన్ బాల్దె సిద్దిలింగం, కురుమ సంఘం మాజీ అధ్యక్షుడు ఆలేటి సిద్దిరాములు, కురుమ సంఘం గౌరవ అధ్యక్షుడు మోటే దేవేందర్, జిల్లా కార్యదర్శి బండ భిక్షపతి, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యకులు ఆలేటి రాజు, జిల్లా ప్రచార కార్యదర్శి జామ మల్లేశ్‌ తదితరులు పాల్గొని కొమురయ్య సేవలను కొనియాడారు.