శభాష్.. అక్షయ

శభాష్.. అక్షయ
  • మెడికల్​ సీటు సాధించిన యువతికి  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అభినందన

ముద్ర ప్రతినిధి, జనగామ: ఇటీవల వచ్చిన నీట్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి సిద్ధిపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన పార్నంది అక్షయను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభినందించారు. జనగామలోని తన క్యాంప్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో ఎక్కువ మందికి డాక్టర్ అయ్యే అవకాశాలు అభిస్తున్నాయన్నారు. మొదటి ప్రయత్నంలోనే అక్షయ మెడికల్ సీటు సాధించడం అనందంగా ఉందని, అవసరం అయితే సిద్ధిపేట మెడికల్ కళాశాల నుంచి జనగామకు బదిలీ చేయిస్తానని హామీ ఇచ్చారు.