జీపీ నిధుల దుర్వినియోగం వాస్తవమే ...

జీపీ నిధుల దుర్వినియోగం వాస్తవమే ...

12.78 లక్షలు స్వాహ ... డిపిఓ రంగాచారి వెల్లడి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివుని పెళ్లి మేజర్ గ్రామపంచాయతీలో రూ. 12 లక్షల 78 వేల జిపి నిధులు దుర్వినియోగం అయినట్లు డిపిఓ రంగాచారి వెల్లడించారు. శివునిపల్లి వార్డు సభ్యుడు బూర్ల విష్ణు జీపీ నిధులను అప్పటి పంచాయతీ కార్యదర్శి దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ అట్టి నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర విజిలెన్స్, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిపిఓ బుధవారం విచారణ చేపట్టారు. విచారణ అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గ్రామంలో జియో కంపెనీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు

జిపికి ఇచ్చిన రూ. 7 లక్షల తోపాటు వివిధ శాఖల ద్వారా పన్నుల రూపేనా గ్రామపంచాయతీకి వచ్చిన నిధులు రూ. 4 లక్షల పై చిలుకు మొత్తంగా కలుపుకొని 12 లక్షల 78 వేలను అప్పటి పంచాయతీ కార్యదర్శి వెంకట కిషోర్ తన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లో వేసుకుని అట్టి మొత్తాన్ని దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. జిపి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కార్యదర్శి పై చర్యల నిమిత్తం విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు డిపిఓ తెలిపారు. ఆయన వెంట డిఎల్పిఓ వరప్రసాద్, ఎంపీ ఓ సుదీర్, కార్యదర్శి శ్రీకాంత్ గ్రామస్తులు ఉన్నారు. “ నిధులు దుర్వినియోగం చేయలేదు” జిపి నిధులను తాను దుర్వినియోగం చేయలేదని, జిపి ఆదాయ, వ్యయాలకు సంబంధించిన రికార్డులు ఆడిటర్ వద్ద ఉన్నందున విచారణ అధికారికి విచారణ సమయంలో అందించలేకపోయానని కార్యదర్శి వెంకట కిషోర్ తెలిపారు.