ఒక్క అవకాశం ఇవ్వండి: జనగామ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల

ఒక్క అవకాశం ఇవ్వండి: జనగామ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల

ముద్ర ప్రతినిధి, జనగామ (చేర్యాల): స్థానికేతరుల పాలనలో నియోజవకర్గం పూర్తిగా వెనుబాటుకు గురైంది, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధికి బాటలు వేస్తా అని బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. శనివారం చేర్యాల పట్టణం పెద్దమ్మగడ్డ, సవాట్, అంగడి బజార్, గాంధీ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మిట్టింగ్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడంతో పాటు వారి వైఫల్యాలను ఎత్తి చూపారు.

ఎంత మంది ఎమ్మెల్యేలు మారినా జనగామ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే, పేద ప్రజలకు జీవనోపాధి కరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలనను కోరుకునే వారందరూ ఈసారి బీజేపీకి ఓటు వేసి తనను గెలిపంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.