మహిళా మంత్రులు మనోళ్లే..

మహిళా మంత్రులు మనోళ్లే..
  • ఓరుగల్లు ఆడబిడ్డలకు ఆరుదైన గౌరవం

ముద్ర ప్రతినిధి, జనగామ :తెలంగాణ సర్కార్లో ప్రమాణస్వీకారం చేసిన 12 మంది మంత్రుల్లో మహిళా మంత్రులు ఇద్దరూ ఉమ్మడి వరంగల్‌కు చెందిన వారే కావడం విశేషం. ఇందులో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ గతంలో కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఇక ములుగు నుంచి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్కకు క్యాబినెట్‌ హోదా దక్కింది. ఇక రేవంత్‌రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గంలో తీసుకున్న ఇద్దరు మహిళా మంత్రులు ఉమ్మడి వరంగల్‌కు చెందిన వారే కావడం విశేషం.