కదం తొక్కిన కార్మిక లోకం

ముద్ర ప్రతినిధి, జనగామ: ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డేను జనగామ పట్టణంలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, డీజేల మధ్య ఎర్రజెండా పాటలతో కార్మికులు భారీ ర్యాలీ తీశారు. అనంతరం వైష్ణవి గార్డెన్ లో జరిగిన బహిరంగ సభకు సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మే డే అంతర్జాతీయ కార్మిక వర్గా ఐక్యతకు సంకేతం అని కొనియాడారు కార్మిక వర్గ చైతన్యానికి ప్రతిరూపమని, దోపిడికి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒకటైన రోజు అని పేర్కొన్నారు.

1886 మే 1న అమెరికా చికాగో నగరంలో హె మార్కెట్లో  ఎనిమిది గంటల పని దినం కోరుతూ లక్షలాది మంది కార్మికులు ప్రదర్శన నిర్వహిస్తుంటే విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో వీరమరణం పొందిన కార్మిక వీరులు  ప్రపంచానికి అందించింది ఎర్రజెండ అని పేర్కొన్నారు. 137 ఏళ్ల క్రితం కార్మికుల సాగించిన వీరోచిత పోరాటాల ఫలితంగానే కార్మికులకు కొన్ని హక్కులు సాధించబడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ లీడర్లు, కార్మికులు పాల్గొన్నారు.