అమ్మవార్లకు అధిక మాస వాయినాలు

అమ్మవార్లకు అధిక మాస వాయినాలు

ముద్ర ప్రతినిధి, జనగామ : అధిక శావణ మాసం సందర్భంగా జనగామ పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి, శ్రీ నగేశ్వర, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాల్లో అమ్మవార్లకు వాయినాలు ఇచ్చారు. పూజారి యల్లంబట్ల ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో మహిళలు శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి మాతాకు 33 రకాలు, శ్రీ పార్వతి అమ్మవారికి 33 రకాలు, శ్రీ సీతాదేవి అమ్మవారికి 33 రకాలు మొత్తం 99 రకాల అధిక మాస వాయనాలు ఇచ్చారు.

కార్యక్రమంలో మొదటగా పెద్ద ఎత్తున మహిళలచే ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం పారాయణం, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ పజ్జూరి గోపయ్య, మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్తా, ప్రోగ్రాం నిర్వహణ ప్రతినిధులు తడకమల్ల నరసింహారావు, తడక మల్ల సుజాత, అయిత శ్రీనివాస్, పూజారులు అవ్వారు ప్రసాద్‌, త్రిపురారి ఈశ్వర్, ఆర్యవైశ్య మహిళా సంఘం, వాసవీ వనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.