ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ప్రజలకు అందించి లక్ష్యాలను సాధించాలి:  అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ 

ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ప్రజలకు అందించి లక్ష్యాలను సాధించాలి:  అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: మహబూబాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్ జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులతో ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, సాధించిన లక్ష్యాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అభిలాషఅభినవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ప్రజలకు అందించి లక్ష్యాలను సాధించాలని బ్యాంకు మేనేజర్లు ప్రత్యేక చొరవతో ప్రజలకు ప్రభుత్వ పథకాల లోన్లు అందజేసి టార్గెట్స్ ని చేరుకోవాలన్నారు. శాఖలలో బడ్జెట్ ఉండి గ్రౌండింగ్ కానివి త్వరగా గ్రౌండింగ్ చేయాలని అన్నారు.

మెప్మా గ్రూపులకు బ్యాంకు లింకేజీ పథకాలు అందజేయాలని అన్నారు. స్వయం సహాయక సంఘాలకు,రైతుల పనిముట్ల యూనిట్లకై, చిన్న పరిశ్రమలు స్థాపించేందుకు, పౌల్ట్రీ బిజినెస్ కొరకు, పాడి పరిశ్రమకు బ్యాంకులు రైతులకు, లబ్దిదారుల కు లోన్లు అందించాలని అదేవిధంగా ఏవైనా బ్యాంకులు లోన్లు ఇవ్వని పక్షంలో ఏకారణాల చేత ఇవ్వడం లేదన్నది దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు.  పెండింగ్ లో ఉన్న ట్రైకార్ లోన్ లు గ్రౌండింగ్ కానివి త్వరగా గ్రౌండింగ్ అయ్యే విధంగా చూడాలని అన్నారు. ఉన్నత విద్యకై విద్యార్థుల చదువులకు బ్యాంకులు ఋణాలు సకాలంలో అందజేసి వారి ప్రకాశవంతమైన భవిష్యత్తుకు బాటలు వేసేలా దోహద పడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులను ప్రోత్సహిస్తూ సబ్సిడీపై ఆయిల్ ఫామ్ పంటను విస్తరణకు కృషి చేస్తుందని, ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో ప్రహారీ కొరకు ఫెన్సింగ్ కు సంబంధించి  లోన్ కావాలని పలు రైతుల నుండి విజ్ఞప్తులు రాగా వాటి సాధ్యాసాధ్యాలపై లోన్ సాంక్షన్ కొరకు బ్యాంక్ అధికారులు దృష్టి సారించాలన్నారు. 

బ్యాంకుల వారీగా పంట రుణాల పనితీరు, బ్యాంకులు పంట రుణాల రెన్యూవల్ శాతం చాలా తక్కువగా ఉందని అదనపు కలెక్టర్‌ అభిలాషఅభినవ్ తెలిపారు. జిల్లాలోని అర్హులైన రైతులందరికీ ఆర్థికసాయం అందించి  90% లక్ష్యాలను సాధించేలా చూడాలని పంట రుణాలు జిల్లా సగటు రాష్ట్ర సగటు కంటే కంటే జిల్లా సగటు తక్కువగా ఉందని మరియు అన్ని బ్యాంకులు 90% లక్ష్యాలను చేరుకోవాలని,వ్యవసాయ టర్మ్ లోన్స్ క్రెడిట్ కింద సాధించిన విజయాలు చాలా తక్కువగా ఉన్నాయి మరియు వాటిని మెరుగుపరచాలని బ్యాంకర్లకు సూచించారు. నాబార్డు ఏజియం చంద్రశేఖర్ మాట్లాడుతూ పెద్ద ప్రాజెక్టులలో అధిక సంఖ్యలో చురుకైన రైతులకు బ్యాంకులు సహాయం చేయాలని సలహా ఇచ్చారు. 

నాబార్డు వారి నుండి డిఆర్డ్ఏ ద్వారా పెద్ద వంగర మండలంలోని చిట్యాల, వడ్డే కొత్తపల్లి గ్రామాలలోని 90 మంది స్వయం సహాయక మహిళలకు చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ మరియు శిక్షణ కొరకు సుమారు 10లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మొత్తo 90 మంది స్వయం సహాయక సంఘాలకు 30 మంది ఒక బ్యాచ్ గా 3 బ్యాచ్ లుగా వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆర్ సత్యనారాయణ మూర్తి,ఆర్బీఐ అనిల్ కుమార్ కల్బోరీ, నాబార్డుఎజీయం చంద్రశేఖర్, డిఆర్డీఏ పిడి సన్యాసయ్య, డిటీడీవో ఎర్రయ్య, డిఎస్ సిడిఓ జిఎం ఇండస్ట్రీస్ సత్యనారాయణ, హార్టీకల్చర్ అధికారి సూర్యనారాయణ, పశు సంవర్దక శాఖ అధికారి సుధాకర్ వివిధ బ్యాంకుల మేనేజర్లు,తదితరులు పాల్గొన్నారు.