సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నరు

సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నరు

ముద్ర ప్రతినిధి, జనగామ: డబుల్ బెడ్ రూం పంపిణీని సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారని ఇందిరమ్మ లబ్దిదారుల సంఘం సహాయ కార్యదర్శి మల్లేష్ ఆరోపించారు. మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో మూడో విడత ఇందిరమ్మ పథకం ద్వారా పట్టాలిచ్చి స్థలాలు చూపించడం మరిచిందన్నారు.

నేటి తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన వాళ్లకు 6 నెలల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసి నేటికి ఐదేళ్లు గడిచిందన్నారు. మూడో విడత లబ్దిదారులు నిరసన చేస్తున్న జనగామ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే లబ్దిదారుల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణం లింగం, భవాణి, కర్ణ, కంది స్వరూప, ఆనంద్ కౌర్, గుండు శశిరేఖ, సంతోష. మోడీ రాములు తదితరులు పాల్గొన్నారు.