బీఆర్‌‌ఎస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ ఇన్‌చార్జిగా కుమార్‌‌గౌడ్

బీఆర్‌‌ఎస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ ఇన్‌చార్జిగా కుమార్‌‌గౌడ్

 రఘునాథపల్లి, ముద్ర: బీఆర్‌‌ఎస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రఘునాథపల్లి మండలానికి చెందిన ఉద్యమకారుడు, మాజీ ఎంపీపీ వై.కుమార్ గౌడ్‌ నియమితులయ్యారు. ఆదివారం హనుమకొండలోని ఎమ్మెల్యే డాక్టర్‌‌ తాటికొండ రాజయ్య స్వగృహంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు ఆయన ఉత్తర్వులు విడుదల చేశారు. కుమార్‌‌ గౌడ్‌తో పాటు నిడిగొండ గ్రామానికి చెందిన తిప్పారపు రమ్య బాబురావును మండల కోఆర్డినేటర్‌‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు.

ఏదైనా విభేదాలు ఉంటే మనలో మనం పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు పెట్టుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. అనంతరం కుమార్ గౌడ్ మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తన నియమానికి సహకరించిన ఎమ్మెల్యే రాజయ్య, ఇతర లీడర్లకు కృతజ్ఞతలు తెలిపారు.