ఇప్పగూడెంలో నిలిచిన కొనుగోలు

ఇప్పగూడెంలో నిలిచిన కొనుగోలు
  • ఆందోళన చెందుతున్న రైతులు 
  • అధికారులు స్పందించాలి: సీపీఎం 

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర:  జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో ధాన్యం కొనుగోలు నిలిచాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతుండగా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తుంది. ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లు ఔటన్ పేరుతో అన్ లోడు చేసుకోక, కొనుగోలు కేంద్రాలకు తిరిగి లారీలు రాక కొనుగోలు మూడు రోజులుగా నిలిచింది. దీంతో రైతులు అకాల వర్షాలు ఎప్పుడు కురుస్తాయో? ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలని ఆందోళన చెందుతున్నారు.

ఇది ఇలా ఉండగా చివరి గింజ కూడా కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం మూడు రోజులుగా ఆగిపోయిన కొనుగోలును పట్టించుకోవడంలేదని సీపీఎం మండల కార్యదర్శి రమేష్ ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రైతులు పసునూరి మల్లారెడ్డి, రోడ్డ రాజయ్య, వంగపండ్ల సోమయ్య, తోడెంగల ఐలయ్య, కంసాని మల్లారెడ్డి, కాసు నాగరాజు, లింగనబోయిన కుమార్, పిట్టల నాగేష్, మునిగెల సోమేశ్వర్, గొర్ల కొమురయ్య, మంద రాజు, టి మల్లయ్య, కంసాని మధు, బోయిని యకయ్య, జిట్టబోయిన గురుస్వామి డిమాండ్ చేశారు.