యశస్విని నామినేషన్ ఓకే

యశస్విని నామినేషన్ ఓకే

పాలకుర్తి ముద్ర: పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిని యశస్విని నామినేషన్ ఓకే అయింది. ఇంతకాలం యశస్సుని నామినేషన్ పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లు అయింది. యశస్విని నామినేషన్ను స్క్రూట్నీలో తొలగిస్తారని వదంతులు వ్యాప్తించిన నేపథ్యంలో ఆమె నామినేషన్ ఓకే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా యశస్విని పలువురు కాంగ్రెస్ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని కార్యకర్తలు శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.  పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించబడిన మామిడాల యశస్విని కి రెండు ఓట్లు ఉన్నాయని కారణంతో ఆమె పోటీకి అనారు రాలంటూ ఈరోజు లాయర్లు నోటీసులు ఎన్నికల అధికారులకు అందజేశారు. దీంతో ఆమె నామినేషన్ స్క్రూట్ నీలోనే తిరస్కరణ గురవుతుందని వదంతులు వ్యాప్తించాయి. సోమవారం స్క్రూట్ ని సందర్భంగా పాలకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ ఆమె నామినేషన్ను ఓకే చేశారు. ఇక మిగిలిన ప్రధాన పార్టీల అభ్యర్థులైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు లేగ రామ్మోహన్ రెడ్డి తో పాటు పలువురి నామినేషన్లు ఓకే చేశారు. పాలకుర్తి నియోజకవర్గం నుండి 39 నామినేషన్లు వేయగా 17 తిరస్కరణకు గురయ్యాయి దీంతో 22 మంది నామినేషన్లు ఓకే అయ్యాయి.