తైక్వాండో జిల్లా ఇన్చార్జిలుగా శ్రీకాంత్, సైదులు

తైక్వాండో జిల్లా ఇన్చార్జిలుగా శ్రీకాంత్, సైదులు

ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా తైక్వాండో ఇన్చార్జిలుగా కొండ్రెడ్డి శ్రీకాంత్, కొండా సైదులు ను  తెలంగాణ స్టేట్ టైక్వాండో అసోసియేషన్ (TSTA) సెక్రటరీ కురువ శ్రీహరి, ప్రెసిడెంట్ మూట శ్రీనివాస్ నియమించడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని సోమవారం హైదరాబాదులో సెక్రటరీ కురువ శ్రీహరి చేతుల మీదుగా అందజేశారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో టైక్వాండో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని వారు తెలియజేశారు.