ప్రవేట్ స్కూల్లో చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని వినతి

ప్రవేట్ స్కూల్లో చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని వినతి

ముద్ర ప్రతినిధి భువనగిరి : ప్రవేట్ స్కూల్లో చదువుతున్న జర్నలిస్టు పిల్లల ఫీజు రాయితీ కోసం యాదాద్రి జిల్లా టి యు డబ్ల్యూ జే ఐ జే యు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి నారాయణరెడ్డికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. డీఈవో నారాయణరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు మున్సిపాలిటీలు మండలాల వారీగా తమ పిల్లలు చదువుతున్న పాఠశాలల వివరాలు అందిస్తే ఎంఈఓ లకు ఆదేశాలిచ్చి 50% ఫీజు రాయితీ ఇప్పించే విధంగా కృషి చేస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రవేట్ కార్పోరేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ మీరు ఉత్తర్వులు జారీ చేయగలరని టీయూడబ్ల్యూజే ఐజేయు తరుపున కోరారు. పలు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ అమలవుతున్నందున మన జిల్లాలో కూడా వెంటనే రాయితీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జే యు జిల్లా అధ్యక్షులు ఎంబ నరసింహులు, జిల్లా కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, జాతీయ కౌన్సిల్ మెంబర్ భువనగిరి మల్లేశం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మరికొండ మల్లేశం, పాశం నవీన్, పత్తిపాటి ఆనంద్, కూరెళ్ళ మల్లేష్, గడసందుల నాగరాజ, ఆరే కుమార్, జోగు సతీష్, నిమ్మల సురేష్ లు పాల్గొన్నారు.