యాసంగి టార్గెల్‌ వెంటనే పూర్తి చేయాలి

యాసంగి టార్గెల్‌ వెంటనే పూర్తి చేయాలి

జనగామ కలెక్టర్ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ: పెండింట్‌లో ఉన్న యాసంగి (2021–22) బియ్యం టార్గెట్‌ను వెంటనే పూర్తి చేయాలని జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య మిల్లర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మినీ సమావేశం మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత యాసంగి 2021–22లో మిల్లర్లకు లక్షా 56 వేల 179 మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇవ్వగా, అందులో 90 శాతం అంటే 95,221 బియ్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సివిల్ సప్లై కార్పొరేషన్‌లకు అప్పగించారని వివరించారు. మిగితా 10 శాతం 10,663 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈనెల లోపు అప్పగించాలని ఆదేశించారు. లేకుంటే వచ్చే యాసంగికి ధాన్యం ఇవ్వబడదని మిల్లర్లను హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీసీఎస్ఓ ఎం.రోజారాణి, డీఎం సివిల్ సప్లై సంధ్యారాణి, డీటీలు ఈ.శ్రీనివాస్, దేవా, మిల్లర్లు ముత్తయ్య, బాల్దె వెంకన్న, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటరు లిస్ట్‌ ను చెక్‌ చేసుకోండి..

ఓటరు లిస్ట్‌ లో పొరపాట్లు లేకుండా చెక్‌ చేసుకోవాలని, తొలగించి వారి వివరాలను మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలని కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ప్రధాన ఎన్నికల అధికారి టి.రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్లతో ఓటర్ జాబితాపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్యతో పాటు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులకు కలెక్టర్ ఓటర్‌‌ జాబితాపై పలు సూచనలు చేశారు. జిల్లాలో ఉన్న ఫొటో సిమిలర్ ఎంట్రీలను ఆర్డీవోలు, తహసీల్దార్లు ప్రత్యేకంగా పరిశీలించాలని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. సమావేశంలో జనగామ ఈఆర్వో సిహెచ్.మధుమోహన్, స్టేషన్ ఘనపూర్ ఈఆర్వో కృష్ణవేణి, ఎన్నికల విభాగం తహసీల్దార్ గంగాభవానీ, డీటీ శంకర్ పాల్గొన్నారు.