దళితుల ఆశాజ్యోతి జగ్గీవన్‌ రామ్‌

దళితుల ఆశాజ్యోతి జగ్గీవన్‌ రామ్‌
  • ఘనంగా బాబూజీ జయంతి వేడుకలు
  • నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

ముద్ర ప్రతినిధి, జనగామ: దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను జనగామ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బాబూజీ విగ్రహానికి జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్‌‌ శివలింగయ్య, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా బాబూజీ దేశానికి చేసిన సేవలను మరువలేమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ చైర్మన్ జమున, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దిలింగం, ఆర్డీవో మధు మోహన్, దళిత సంఘాలు, వివిధ పార్టీల లీడర్లు నాయకులు డాక్టర్‌‌ రాజమౌళి, ఉడుగుల నర్సింహులు, మళ్లిగారి రాజు, గిరిమల్ల రాజు, పానుగంటి ప్రవీణ్‌, కౌన్సిలర్లు వాంకుడోతు అనిత, బొడ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు