అక్కడ అమలు కానివి...

అక్కడ అమలు కానివి...
  • ఇక్కడ ఎలా అమలు చేస్తారు
  • కాంగ్రెస్ నేతలు చవటలు, దద్దమ్మలు
  • ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని 6 గ్యారెంటీలు తెలంగాణలో ఎలా అమలు చేస్తారని టిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివుని పల్లిలో గురువారం కార్యకర్తల ఆత్మీయ సమావేశం స్థానిక ఎంపీటీసీ బూర్ల లతా శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాపీ కొట్టి ఆరు గ్యారెంటీ స్కీములను విజయభేరి సభలో ప్రకటించిన అన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగి మీరు అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో ఆ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలు తెలంగాణలో అమలు చేస్తామని చెప్పడం ప్రజల్ని మోసం చేయడమే అన్నారు. 2009 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేకమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే స్పందించని కాంగ్రెస్ పార్టీ నేతలు, కృష్ణా, గోదావరి జలాలను నిధులు, నియామకాలు ఆంధ్రకు తరలిస్తుంటే నోరు విప్పని చవటలు దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని శ్రీహరి ధ్వజమెత్తారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, టిఆర్ఎస్ ప్రకటించిన ముందస్తు అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ, బిజెపిలు ఎన్ని కుట్రలు కుయుక్తులు పన్నినా రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ వెంటే ఉన్నారని 90 సీట్లకు పైగా గెలుచుకొని మూడోసారి అధికారం చేపట్టడం ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ఖాయమన్నారు. 9 ఏళ్లకు ముందు గ్రామాల్లో ఉన్న పరిస్థితి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితి ప్రజలకు వివరించి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని స్టేషన్ ఘన్ పూర్ లో గులాబీ జెండా ఎగరవేయాలని ఆయన పిలుపు నిచ్చారు. సమావేశంలో బెల్దే వెంకన్న, కొంతం శ్రీనివాస్, గుర్రం పాతి కుమార్, గుర్రం రాజు, అంగడి సమ్మక్క, లకావత్ సునీత, గోలి లక్ష్మి, చిగురు సరిత, వంగ శ్రీనివాస్, చిగురు విజయ్, ఆరెల్లి  అశోక్, అమృతమ్మ, గుర్రం ఏసుబాబు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు