బాబు అరెస్ట్ అప్రజాస్వామికం 

బాబు అరెస్ట్ అప్రజాస్వామికం 
  • టిడిపి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు

స్టేషన్ ఘన్‌పూర్, ముద్ర: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్రజా స్వామికమని మేధావులు, రాజకీయవేత్తలు ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించాలని టిడిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మోటం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తండ్రిని అడ్డుపెట్టుకొని వేల కోట్లు అక్రమంగా సంపాదించిన వైయస్ జగన్ మచ్చలేని నాయకుడు చంద్రబాబును అరెస్టు చేయించడం ఆయన పైశాచిక ఆనందానికి నిదర్శనం అన్నారు. వైయస్ జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ను దోచుకు తింటున్నాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని, చంద్రబాబు నాయుడుని ఎదుర్కోలేక అక్రమ కేసులు మనయించి బాబును జైలుకు పంపిన జగన్ కు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో ఎస్టి సెల్ రాష్ట్ర కార్యదర్శి గుగులోతు మోహన్ నాయక్ నాయకులు లాలు నాయక్, లక్ష్మణ్ నాయక్, బాలాజీ నాయక్ ఉన్నారు.