గుండెపోటుతో బీఆర్ఎస్ నాయకుడి మృతి

గుండెపోటుతో బీఆర్ఎస్ నాయకుడి మృతి

ముద్ర ప్రతినిధి, జనగామ:

జనగామ మండలంలోని పసరమడ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కల్లు గీతకార్మిక సంఘం లీడర్ దూడల పాండు ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని జనగామ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మేకల కళింగ రాజు సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం  కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జనగామ మండల కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్, సర్పంచ్ శివరాత్రి స్వప్న-రాజు, బీఆర్ఎస్ నాయకులు మైసా గౌడ్, భూపాల్, బెజరబోయిన ఆంజనేయులు, కొంతం రమేష్, కుర్రేముల సిద్దయ్య, కుర్రేముల నాగభూషణం, చింతపండు వెంకటేశ్ ఉన్నారు.

కల్లుగీత కార్మిక ఉద్యమానికి తీరని లోటు

కల్లుగీత కార్మిక సంఘం జనగామ జిల్లా సీనియర్ నాయకుడు దూడల పాండు మృతి కార్మిక ఉద్యమాలకు తీరని తోటని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జిల్లా కార్యదర్శి బల్నే  వెంకటమల్లయ్య అన్నారు. గుండెపోటుతో చనిపోయిన  పాండు మృతదేహాన్ని ఆయన స్వగృహమైన పసరమడ్ల గ్రామానికి  వెళ్లి సందర్శించి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ పాండు తనకు ఊహ తెలిసినప్పటి నుంచి గత 50 సంవత్సరాలుగా కల్లుగీత కార్మిక సంఘంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేశారని జిల్లా కమిటీ సభ్యుడిగా సేవలందించారని గుర్తుచేసుకున్నారు. వారి వెంట సీనియర్ నాయకులు జనగామ మాజీ ఎంపీపీ బైరగోని యాదగిరి,  KGKS  జనగామ మండల కార్యదర్శి మార్కా ఉపేందర్,  బండిగారి శివరాజు తదితరులు ఉన్నారు.