ప్రభుత్వ వ్యతిరేకతను కపిపుచ్చేందుకే అక్రమ అరెస్టులు...

ప్రభుత్వ వ్యతిరేకతను కపిపుచ్చేందుకే అక్రమ అరెస్టులు...
  • సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు..
  • బిజెపి స్టేట్ చీఫ్,ఎంపీ బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలి...
  • బిజెపి రాష్ట్ర నాయకులు ,మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పంతులు.

ముద్ర , రాజన్న సిరిసిల్ల : తెలంగాణ వస్తే ప్రజల బతుకులు బాగుపడతాయి అనుకున్నాము కానీ, కానీ వచ్చిన తెలంగాణలో బాగుపడ్డది కేసీఆర్ కుటుంబమేనని, ప్రజలలో బీఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నదని, ఆ  వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే అక్రమంగా బిజెపి నాయకులను అరెస్టు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పంతులు అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కటకం మృత్యుంజయం మాట్లాడుతూ  బిజెపి స్టేట్ చీఫ్ సంజయ్ ని  దేశద్రోహం చేసిన వాడిగా అర్ధరాత్రి అరెస్టు చేయడం సిగ్గుచేటు అని, కనీసం సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏమిటని, అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా అని ప్రశ్నించారు. అనేక ప్రభుత్వాలు గతంలో సైనిక చర్య, పోలీసుల ద్వారా ప్రతిపక్షాల గొంతులను అనిచివేస్తే, ఆ ప్రభుత్వాలు ప్రస్తుతం కనుమరుగాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టులో కుంభకోణాలు జరిగాయని, అవి సరిపోక  పరీక్ష పత్రాలు లీక్ చేసి  అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మీ ప్రభుత్వం, మీ అధికారులు, మీ పోలీసులు మరి పరీక్ష పత్రాలు ఎలా లీకు అవుతున్నాయని, దినికి మీకు సంబధం లేదా,దీనికి బండి సంజయ్ ను అరెస్టు చేయడం ఎందుకని ,అక్రమ అరెస్టులు  పాల్పడితే రానున్న రోజుల్లో రాష్ట్రం అగ్నిగుండం అవుతాదనీ హెచ్చరించారు. ప్రభుత్వం తీరుపై మేధావులను, యూనివర్సిటీ ప్రొఫెసర్ లను అడగండి, ప్రభుత్వం  ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,ఉద్యోగాల భర్తీ, దళితులకు మూడు ఎకరాల భూమి, మొదలగు వాటిని అమలు చేయడంలో బీ ఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని , ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంగి, లాగు, స్లిప్పర్ చెప్పులు లేని మీకు 8 ఏళ్లలో  ఇంత సంపద ఎక్కడిదని, ఇది అంత తెలంగాణ ప్రజల సొమ్మేనని  అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులను ఇచ్చిందని, ఈనెల 8న  రాష్ట్రంలో వందే భారత్ రైల్లను ప్రారంభించడానికి పీ ఏం మోడీ వస్తున్నారని అన్నారు.

త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి పథకాలు, ఇతర అభివృద్ధిపై నివేదికలు విడుదల చేస్తామని తెలిపారు. ఎనిమిది నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని, పోలీసులు అధికారులు ఒక్కసారి ఆలోచించి ,తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనకు వచ్చినప్పుడులా , బిజెపి నాయకులకు ,కార్యకర్తలకు భయపడి అరెస్టు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదు అని అన్నారు. బండి సంజయ్ ని, బీజేపి నాయకులను  వెంటనే రిలీజ్ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, నాయకులు మురళీ, కృష్ణ కాంత్, మహేష్, దుర్గేష్, ఎలేందర్, దమ్మ శ్రీనివాస్, లక్ష్మినారాయణ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు