సొంత పార్టీ నేతలపైనే కేటీఆర్ మేనభావ ‘చీటీ’ ఫైర్..

సొంత పార్టీ నేతలపైనే కేటీఆర్ మేనభావ ‘చీటీ’ ఫైర్..
  • జిల్లా నాయత్వం ఏం చేస్తుంది.. ఎవరి బాధలు పట్టించుకుంటున్నరు
  • బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిలదీత..చప్పట్లు కొట్టిన కార్యకర్తలు

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:
రాజన్నసిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ నాయకత్వ లోపాలపై బీఆర్ఎస్ పార్టీలోనే విమర్శలు.. వాదోపాదాలు.. నిలదీతలు కొనసాగుతున్నాయి. ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో పద్మనాయక కల్యాణమండపంలో నిర్వహించారు. ప్రెస్ వారికి కి కూడ నో ఎంట్రి. బీఆర్ఎస్ జిల్లా నాయకులు పార్టీ క్యాడర్ను సమన్వయ పరిచి.. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ క్యాడర్ ను మరింత బలోపేతం చేయడానికి కేవలం ముఖ్య లీడర్లు, 100 మంది కార్యకర్తలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హజరైన మంత్రి కేటీఆర్ మేనభావ చీటీ నర్సింగరావ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా క్యాడర్ ఏం చేస్తుందని, గ్రామాల్లో కార్యకర్తల గోడు వినవేరు ఎవరున్నారని, ఎవరికైన పని పడిన.. అపదోచ్చిన.. జిల్లా అధిష్టానం పట్టించుకున్న దాఖాలలు లేవని చీటీ నర్సింగరావ్ సమావేశంలో బహిరంగగానే విమర్శించారు. గిట్ల ఐతే పార్టీ ఎట్ల ముందుకు పోతది.. ఇందుకేనా పదవులు తీసకున్నది అంటూ ఫైర్ అయ్యారు.దీంతో ముందున్న ముఖ్య కార్యకర్తలు చప్పట్లు కొట్టి చీటీ నర్సింగరావుకు మద్దతు పలికినట్లు తెలిసింది. చీటీ సోంత పార్టీ వారినే నిలదీయడంతో బీఆర్ఎస్ జిల్లా నేతలు ఒకరి మోహలు ఒకరు చూసుకోవడం వారి వంతయినట్లు సమాచారం.