జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న దేవరాజు 

జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న దేవరాజు 

ముద్ర,ఎల్లారెడ్డిపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలగందుల దేవరాజు జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు ను జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి ,  ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు పిల్లి రేణుక కిషన్, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ చేతుల మీదుగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం రోజున మంగళవారం అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల విద్యాశాఖాధికారి రఘుపతి ,అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా  రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవరెడ్డి, ఉపసర్పంచ్ దేవయ్య, ఎంపిటీసీ సభ్యులు శ్రీ నివాస్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు జబ్బర్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి  ప్రదానోపాద్యాయులు దేవరాజు ను అభినందించారు.