నిరుద్యోగి నవీన్ ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య - ఆది శ్రీనివాస్

నిరుద్యోగి నవీన్ ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య - ఆది శ్రీనివాస్

ముద్ర సిరిసిల్ల టౌన్; రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో విలేకురుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ చిటికెన నవీన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం నా మనసును కలచి వేసింది అన్నారు. యువకుని ఆత్మహత్యని తెలంగాణ ప్రభుత్వ హత్యగా పేర్కొన్నారు, తెలంగాణ ఉద్యమ సమయంలో యువకులకు ఇంటికొక ఉద్యోగం అనే భ్రమను కలిగించి యువకులను వాడుకొని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగానే కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన క్రమములో ప్రశ్నాపత్రాలు లీకేజి చేసి ఈ ప్రభుత్వమే తమ అనుచరులకు, తమ సంబంధీకులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి భవన్ కేంద్రంగా ఈ లీకేజి వ్యవహారం నడిపించిదని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు