అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
Former MP Ponnam Prabhakar visited Ammavari

ముద్ర, ఎల్లారెడ్దిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దుర్గమ్మ దేవాలయాన్ని పునర్నిర్మానం చేసిన సందర్భంలో ఆదివారం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్,కేకే మహేందర్ రెడ్డిలను  శాలువా కప్పి సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు చెన్నిబాబు, గుండాడి రామ్ రెడ్డి, వంగ మల్లారెడ్డి,  రొడ్డ రామచంద్రం,చెరుకు ఎల్లయ్య, భానుతు రాజు నాయక్,  బాలు యాదవ్, నందు  పాల్గొన్నారు.