జాతీయ చేనేత ఐక్యవేదిక నియోజకవర్గ ఇంచార్జి “'గజ్జల'

జాతీయ చేనేత ఐక్యవేదిక నియోజకవర్గ ఇంచార్జి “'గజ్జల'

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన గజ్జల దామోదర్ జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇంచార్జిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షులు అవార్ మల్లికార్జున్, రాష్ట్ర అధ్యక్షులు మాడరాజా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని,చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి పద్మశాలి కులస్తులను ఐక్యమత్యం చేస్తూ సంఘాన్ని మరింత బలపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు పద్మశాలిలకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తన నియమానికి సహకరించిన జాతీయ, రాష్ట్ర నాయకులకు జనగామ జిల్లా అధ్యక్షులు చింతకింది కృష్ణమూర్తి కి కృతజ్ఞతలు తెలిపారు.