బేబీ ..ఫ్రెష్ అప్రోచ్ ఉన్న లవ్ స్టోరి

బేబీ ..ఫ్రెష్ అప్రోచ్ ఉన్న లవ్ స్టోరి

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ బేబీ. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా రాబోతోంది. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో తన పాత్ర విశేషాలు తెలిపారు.- ఈ సినిమాలో నా పాత్ర పేరు విరాజ్. తొలిసారి నా రియల్ నేమ్ క్యారెక్టర్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆనంద్, వైష్ణవి, నా పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. రియల్ వరల్డ్ తో కనెక్ట్ అయినట్లు బిహేవ్ చేస్తుంటాయి. నేను కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. జీవితం గురించి ఏమీ తెలియని ఓ కుర్రాడు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా ఉంటాడు. - బేబీ గురించి చెప్పాలంటే దర్శకుడు సాయి రాజేష్ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ కు ఒక బ్యాక్ స్టోరి చెప్పారు. దాంతో నా క్యారెక్టర్ అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అనేది తెలిసిపోయి యాక్టింగ్ ఈజీ అయ్యింది. మా సినిమా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బేబీ సినిమాలో డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయి.- ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కొత్త టోన్ ఇచ్చింది. విజువల్ గా బ్యూటీ ఉంటుంది. ఎలాంటి సీన్స్ అయినా కొత్త కలర్ కనిపిస్తుంది. అలాగే విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు విప్లవ్ ఎడిటింగ్ కూడా క్రిస్పీ నెస్ తెచ్చింది. చాలా షార్ప్ గా ప్లెజంట్ వేలో ఎడిట్ చేశారు. నా సినిమాల్లో ప్రాపర్ గా థియేటర్ రిలీజ్ కు వస్తున్న సినిమా ఇది. ఇందులో ప్రతి క్యారెక్టర్ కు యాక్టింగ్ కు స్కోప్ ఉంటుంది. నా క్యారెక్టర్ కు కూడా యాక్టింగ్ స్కోప్ బాగుంది.