స్పై’ లో ఛాలెజింగ్ రోల్ చేశాను‌‌– ఐశ్వర్య మీనన్

స్పై’ లో ఛాలెజింగ్ రోల్ చేశాను‌‌– ఐశ్వర్య మీనన్
  • స్పై’ లో ఛాలెజింగ్ రోల్ చేశాను‌‌– ఐశ్వర్య మీనన్

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై'తో వస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చ‌ర‌ణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో  నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. జూన్ 29న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ విలేకరుల సమావేశంలో 'స్పై' విశేషాలని పంచుకున్నారు.  

స్పై నా మొదటి తెలుగు సినిమా. నిజంగా డ్రీమ్ డెబ్యు. దర్శకుడు గ్యారీ బిహెచ్ ఈ సినిమా సైన్ చేసినపుడే నన్ను హీరోయిన్ గా అనుకున్నారు. నేరుగా వచ్చి కథ చెప్పారు. కథ విని చాలా థ్రిల్ అయ్యాను.  ఇందులో నాది చాలా ఇంటెన్స్ రోల్. మరో ఆలోచన లేకుండా సైన్ చేశాను. స్పై .. ఎక్సయిటింగ్ యాక్షన్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది. ఇందులో నా పాత్రకు చాలా కోణాలు వుంటాయి. యాక్షన్, స్టంట్స్ అన్నీ వుంటాయి. రా ఏజెంట్ గా కనిపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. యాక్షన్,  గన్ షూటింగ్ లో  దాదాపు ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. నిజంగా ఇది చాలా ఎక్సయిటింగ్ జర్నీ. ఈ పాత్ర  చేసే క్రమంలో 'రా' గురించి చాలా నేర్చుకున్నాను. ఎలాంటి గుర్తింపుని ఆశించకుండా దేశానికి సేవ చేస్తుంటారు. అలాగే ఈ సినిమా యాక్షన్ విషయంలో నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది. ఇకపై యాక్షన్ పాత్రలు వస్తే చాలా కాన్ఫిడెంట్  గా  చేస్తాననే నమ్మకం వుంది. స్పై కి పార్ట్ 2 చేసే స్కోప్ వుంది. ఒకవేళ అది జరిగితే అందులోనూ నేనే హీరోయిన్ గా ఉండాలనేది నా కోరిక.(నవ్వుతూ) నేను ఇది వరకు యాక్షన్ సినిమాలు చేయలేదు. రా ఏజెంట్ గా కనిపించడం అంటే దానికి   ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మన కదలిక, యాక్షన్, ఫైట్. యాటిట్యూడ్ అన్నీ రా ఏజెంట్ లా సహజంగా ఉండేలా చూసుకోవడం ఛాలెంజింగ్ గా అనిపించింది.  ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.