ఎగ్జైటింగ్‌గా సారా ట్రిప్‌

ఎగ్జైటింగ్‌గా సారా ట్రిప్‌

వ‌రుస‌ ప్రాజెక్ట్‌ల కోసం సన్నద్ధం కావడానికి ముందు సారా సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఇటీవ‌లే ఫ్యాష‌న్ పుట్టిల్లు పారిస్‌ని రిలాక్స్ డ్‌గా అన్వేషించడానికి కొంత సమయం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో సారా తన ప్యారిస్ ట్రిప్ నుంచి చాలా ఫొటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. సారా ఊబ‌ర్-కూల్ దుస్తులలో అందంగా క‌నిపించింది. తాజాగా సారా అలీఖాన్ త‌న లాహోల్ ట్రిప్ నుంచి అద్భుత‌మైన ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. ఒక వీడియోలో సారా అలీఖాన్ మాట్లాడుతూ.. తాను లాహోల్- స్పిటీ వ్యాలీలో ఉన్నాన‌ని వెల్లడించింది. స్పిటీ వ్యాలీ అంద‌మైన ప్రకృతితో స్వర్గధామం. అక్కడ ఎత్తయిన ప‌ర్వతాలు, ఘాట్ రోడ్ లు ప్రకృతి ఎంతో ఆక‌ర్షణీయంగా ఉంటుంది. ఇది టూరిస్ట్ స్పాట్ ల‌కు ప్రసిద్ధి. హిమ‌చ‌ల్ ప్రదేశ్ లోని మ‌నాలి మీదుగా ఈ మార్గం ఎంతో ఎత్తున ఉంటుంది. వేల మీట‌ర్ల ఎత్తున ఆక్సిజ‌న్ అంద‌ని చోటికి ప్రయాణించాల్సి ఉంటుంది. ఆస‌క్తిక‌రంగా సారా అలీఖాన్ ఈ ప్రయాణంలో త‌న ఆహారాన్ని తానే వండుకుని తిన‌డం ఆస‌క్తిని క‌లిగించింది. త‌న‌తో పాటే త‌న స్నేహితులు కూడా ఈ ట్రిప్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఎగ్జైటింగ్‌ ఈవీడియో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.