రామ్​చరణ్​విడుదల చేసిన 'భోళా శంకర్' ట్రైలర్ 

రామ్​చరణ్​విడుదల చేసిన 'భోళా శంకర్' ట్రైలర్ 

మెగాస్టార్ చిరంజీవి  మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో  రామబ్రహ్మం సుంకర  గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. టీజర్‌ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ తో ఆకట్టుకున్న మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ తో ముందుకు వచ్చారు.  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.భోళా శంకర్ ట్రైలర్ కోల్‌కతాలోని అందోళనకర పరిస్థితులలో ఆసక్తికరమైన నోట్ తో ప్రారంభమవుతుంది. చాలా మంది యువతులు కిడ్నాప్ అవుతారు. వారి తల్లిదండ్రులు, పోలీసులు భయాందోళనలో వుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కిడ్నాప్‌ల వెనుక ఉన్న సూత్రధారిని పోలీసులు కనుగొనలేకపోతారు. అప్పుడు భోళా శంకర్.. నేరస్థుడిని పట్టుకోవడానికి, అమ్మాయిలను రక్షించడానికి వస్తాడు. సీరియస్‌గా ప్రారంభమైన  కథనం ఒకదాని తర్వాత ఒక  ప్రధాన పాత్రల ప్రవేశంతో వినోదాత్మకంగా మారుతుంది. చిరంజీవి వింటేజ్  అవతార్‌లో కనిపించి తన మాస్ పవర్‌ను మరోసారి చూపించారు. యాక్షన్‌తో పాటు వినోదాత్మక సన్నివేశాలలో కూడా ఎక్స్ టార్డినరిగా వున్నారు. డిఫరెంట్ సీన్స్ లో రాజశేఖర్, పవన్ కళ్యాణ్‌లను మెగాస్టార్ అనుకరిస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. తమన్నా భాటియా లాయర్‌గా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా , సుశాంత్ ఆమె బాయ్ ఫ్రండ్ గా కనిపించారు.  వెన్నెల కిషోర్ భోళా సీనియర్‌గా కనిపించడం నవ్వులు పూయించింది.