రెడ్డీస్​ల్యాబ్​లాభాల్లో 18 శాతం వృద్ధి

రెడ్డీస్​ల్యాబ్​లాభాల్లో 18 శాతం వృద్ధి
  • రూ. 1450 కోట్లు.. ఫలితాలను వెల్లడించిన
  • ఎండీ, కో చైర్మన్​జీవీ ప్రసాద్​

ముంబై: ప్రముఖ ఫార్మా దిగ్గజ సంస్థ డాక్టర్​రెడ్డీస్​ ల్యాబోరేటరీస్​ తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ లాభాలను ఆర్జించినట్లు ప్రకటించింది. గతంతో పోల్చుకుంటే రూ. 1405 లాభాలు 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏడాది క్రితం రూ.1,189 కోట్లుగా ఉన్న పన్నులు చెల్లించిన తర్వాత లాభం గత త్రైమాసికానికిగాను రూ.1,405 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 29 శాతం ఎగబాకి రూ.6,757.90 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇది రూ.5,232.90 కోట్లుగా ఉన్నది.

ఫలితాలను సంస్థ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్​ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీ విక్రయాల్లో ఉత్తర అమెరికా వాటా 47 శాతంగా ఉండగా..యూరప్‌ 8 శాతం, భారత్‌ 17 శాతం వాటా కలిగివుందన్నారు. తొలి త్రైమాసికంలో అంతర్జాతీయంగా జనరిక్‌ ఔషధాలను విక్రయించడంతో సంస్థకు రూ.6,101 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 36 శాతం అధికమన్నారు. ఉత్తర అమెరికా నుంచి రూ.3,200 కోట్లు, యూరప్‌ నుంచి రూ.510 కోట్లు, భారత్‌ నుంచి రూ.1,150 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.670 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయన్నారు. నిర్వహణ ఖర్చులు రూ.4,628.2 కోట్ల నుంచి రూ.5,086.2 కోట్లకు చేరుకున్నాయన్నారు. ‘తొలి త్రైమాసికంలో అమ్మకాలు భారీగా పెరగడం, మార్జిన్లు అధికంగా ఉండటం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందన్నారు. అమెరికా, రష్యాలో పలు జనరిక్‌ ఉత్పత్తులు విడుదల చేయడం కూడా కలిసొచ్చిందని, భవిష్యత్తులో పరిశోధనలు, నూతన ఉత్పత్తుల కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఎండీ జీవీ ప్రసాద్​ స్పష్టం చేశారు.