అల్లు అర్జున్ తగ్గేదేలే...

అల్లు అర్జున్ తగ్గేదేలే...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'పు ష్ప 2. పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'పుష్ప' చిత్రానికి ఇది సీక్వెల్. ఈ రోజు బన్నీ బర్త్ డే. అయితే, అభిమానులకు ఒక్క రోజు ముందు 'పుష్ప 2' టీమ్ గిఫ్ట్ ఇచ్చింది. సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్, అలాగే 'వేర్ ఈజ్ పుష్ప' టీజర్ విడుదల చేసింది. ఆ లుక్, టీజర్ రికార్డులు క్రియేట్ చేశాయి.

మోస్ట్ లైక్డ్ ఫస్ట్ లుక్!
'పుష్ప 2'లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అయ్యింది. చీర కట్టి, ముక్కు పుడక పెట్టి, బొట్టుతో బన్నీ కొత్తగా కనిపించారు. తిరుపతిలో గంగమ్మ జాతరలో పురుషులు ఏ విధంగా పాల్గొంటారో, ఆ విధంగా కనిపించి ఔరా అనిపించారు. ఆ లుక్ రికార్డులు క్రియేట్ చేసింది.

సోషల్ మీడియాలో లైకులే లైకులు!
అల్లు అర్జున్ 'పుష్ప 2' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ట్విట్టర్‌లో 207కె, ఫేస్‌బుక్‌లో 5 మిలియన్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 850కె లైక్స్ వచ్చాయి. ఎక్కువ మంది లైక్ చేసిన లుక్ కింద 'పుష్ప 2' రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో 'వేర్ ఈజ్ పుష్ప' టీజర్ అయితే 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమా టీజర్లలో 'ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్' మూడో స్థానంలో నిలిచింది. దీనికి 22.52 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హిందీ వెర్షన్ టీజర్ 30 మిలియన్ వ్యూస్ కు చేరువలో ఉంది. యూట్యూబ్‌లో 24 గంటల్లో ఎక్కువ మంది లైక్ చేసిన టీజర్లలో రెండో స్థానంలో ఉంది. 793కె లైక్స్ వచ్చాయి.