భయపెడుతున్న ఎర్ర చీర మోషన్ పోస్టర్ 

భయపెడుతున్న ఎర్ర చీర మోషన్ పోస్టర్ 

పద్మాలయా ఎంటర్​టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో నిర్మించిన హర్రర్, యాక్షన్, థ్రిల్లర్, మదర్ సెంటిమెంట్ సౌత్ ఇండియా చిత్రం ఎర్రచీర. నవంబర్ 9న అందరినీ భయపెట్టే ఎర్రచీర సినిమా విడుదల కానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రాఖీ పండుగ సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ కనుక గమనిస్తే సినిమాలో భారీ తారాగణంతో సమానంగా ఎర్రచీర ఎలాంటి ముఖ్యపాత్ర పోషించినదో ప్రేక్షకులకు తెలియచేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని ఈ చిత్రం చూస్తున్నంతసేపు హర్రర్ సీన్స్ తో థ్రిల్లింగ్​గా ఉంటుందని, మదర్ సెంటిమెంట్ హార్ట్ టచింగ్ గా ఉంటుందని" దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ ఎర్ర చీర వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలి అంటే నవంబర్ 9న సినిమాని థియేటర్స్ లో చూడాల్సిందే అని ఆయన అన్నారు. ఈ సినిమాలో ఎయిట్​లేయర్స్​  వారి విఎఫ్ఎక్స్​తో కళ్లుచెదిరే 36 నిమిషాల గ్రాఫిక్స్ తో, మంచి నిర్మాణ విలువలతో నిర్మించబడినదని నిర్మాతలు ఎన్.వి.వి. సుబ్బారెడ్డి, సుమన్ బాబు తెలిపారు.