సినిమా బాగుంది.. అందరూ చూడండి: నటుడు శివరామ్ రెడ్డి

సినిమా బాగుంది.. అందరూ చూడండి: నటుడు శివరామ్ రెడ్డి
Actor Sivaram Reddy

ముద్ర, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శివరామకృష్ణ థియేటర్ లో మంగళవారం రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన శివరాం రెడ్డి అనే యువకుడు సందడి చేశాడు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమా బాగుందని,అందులో నటించిన శివరాం పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆశీస్సులతో మరిన్ని మంచి పాత్రలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు పొంది ఈ ప్రాంతానికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మిత్రులు,పట్టణ ప్రజలు పేర్కొన్నారు.