ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డ్

ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డ్

గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ తో పాటు.. పలు అంతర్జాతీయ అవార్డ్ లను తన సొంతం చేసుకుంది. నాటు నాటుసాంగ్ తాజాగా మరో ఘనతను సాధించింది. ఒక అచ్చ తెలుగు నాటు నాటు పాట ప్రపంచాన్ని, హాలీవుడ్ ఒక  ఊపు ఊపేసింది. ఆర్​ఆర్​ఆర్​ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సినిమా అవార్డు అయిన ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ లో బెస్ట్ ఒరిజినల్ విభాగంలో నిలిచింది. ఇక మరికొద్ది గంటల్లో ఆస్కార్ వేడుకలు జరుగుతుండటంతో భారతీయులంతా ఈ వేడుక కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.  

ఆస్కార్ కు ముందు నాటు నాటు సాంగ్ కి మరో ప్రశంస దక్కింది.అమెరికాలోని సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ  ఈ పాటకు .. ఈ పాట రాసిన చంద్రబోస్ కు ప్రత్యేకమైన ప్రశంసని అందించింది. శనివారం రాత్రి సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ కార్యక్రమం జరగగా ఈ ఈవెంట్ లో నాటు నాటు సాంగ్ కు గాను ఈ పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణిలను అభినందిస్తూ ప్రశంస పత్రాన్ని అందించారు. ఈ ఈవెంట్ లో వేదికపైకి వెళ్ళి  చంద్రబోస్ ఈ సత్కారాన్ని స్వీకరించారు. ఇక చంద్రబోస్ ఈ ప్రశంసా పత్రంతో పాటు.. అదే స్టేజ్ పై ఉన్న ప్రపంచ ప్రఖ్యాత గేయ రచయితలతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్ లో శేర్ చేశారు.