బంగ్లాదేశ్ ​విజయం - చతికిల బద్ద భారత్​ వుమెన్స్​జట్టు

బంగ్లాదేశ్ ​విజయం -  చతికిల బద్ద భారత్​ వుమెన్స్​జట్టు

మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మూడు టీ–20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన మూడో టీ–20లో బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 102 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(41 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40), జెమీమా రోడ్రిగ్స్(26 బంతుల్లో 4 ఫోర్లతో 28) మినహా అంతా విఫలమయ్యారు. స్మృతి మంధాన(1), షెఫాలీ వర్మ(11)‌తో పాటు యస్తికా భాటియా(12), అమన్‌జోత్ కౌర్(2), పూజా వస్త్రాకర్(2), దీప్తి శర్మ(4), మిన్ను మణి(1) తీవ్రంగా నిరాశపరిచారు.

బంగ్లాదేశ్ బౌలర్లో సుల్తాన ఖాటున్(2/17) రెండు వికెట్లు తీయగా.. రబెయ ఖాన్(3/16) మూడు వికెట్లు పడగొట్టాడు. నహిదా అక్తర్, ఫహిమా ఖాటున్, షోర్నా అక్తర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలోనే 6 వికెట్లకు 103 పరుగులు చేసింది. షమీమా సుల్తానా(46 బంతుల్లో 3 ఫోర్లతో 42) .. నహిదా అక్తెర్(10 నాటౌట్) రాణించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మిన్ను మణి, దేవికా వైద్య రెండేసి వికెట్లు తీయగా.. జెమీమా రోడ్రిగ్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. వరుసగా రెండు టీ20ల్లో విజయం సాధించిన భారత్ 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది. సోమవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేసింది. షెఫాలీ వర్మ(19) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ నిగర్ సుల్తాన్(38) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో షెఫాలీ వర్మ(3/15), దీప్తి శర్మ(3/12) మూడేసి వికెట్లతో సత్తా చాటగా.. మిన్ను మణి రెండు వికెట్లు తీసింది. తెలుగు తేజం బారెడ్డి అనూష‌కు ఓ వికెట్ దక్కింది.