'తిరగబడరసామీ'  పాట విడుదల  

'తిరగబడరసామీ'  పాట విడుదల  


హీరో రాజ్ తరుణ్  సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇదివరకే  విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు తిరగబడరసామీ మ్యూజికల్ జర్నీ మొదలైయింది. ఈ చిత్రంలోని 'చాల బాగుందే' పాటని విడుదల చేశారు మేకర్స్. మనసుని హత్తుకునే హార్ట్ ఫుల్ లవ్​లీ మెలోడీగా ఈ పాటని కంపోజ్ చేశారు జెబి. చైతు సత్సంగి, లిప్సిక ఈ పాటని మ్యాజికల్ గా పాడారు. శ్రీమణి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ అండ్ లవ్లీగా వుంది.