రంగబలి ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది

రంగబలి ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది

నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’ తో వస్తున్నారు. ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. జూలై 7న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకునే సుమగారు ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఉండటం ఆనందంగా వుంది. సుధాకర్ గారు, నేను ఎప్పటి నుంచో కలసి సినిమా చేయాలని అనుకున్నాం. పవన్ చెప్పిన కథ మా ఇద్దరికీ నచ్చింది. చేస్తే ఇలాంటి కథ చేయాలనిపించింది. చాలా నమ్మకంగా చెబుతున్నాను. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. నాకు ఈ సినిమా నుంచి బ్లాక్ బస్టరే కావాలి. చాలా మంచి సినిమాని ప్రేక్షకులకు, అభిమానులకు ఇవ్వబోతున్నాననే నమ్మకం వుంది. ఇప్పటివరకూ సుధాకర్ గారికి వచ్చిన లాభాలు కంటే ఈ సినిమాకి వచ్చిన లాభాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకంగా చెబుతున్నాను.  యుక్తి చక్కగా నటించింది. సత్య మంచి టైమింగ్ వున్న నటుడు. ఇందులో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. వంశీ, దివాకర్ మణి మంచి విజువల్స్ ఇచ్చారు. పవన్ చాలా మంచి ఆల్బం ఇచ్చారు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జూలై 7న థియేటర్ లో కలుద్దాం'' అన్నారు.