అంద్వత్వ నివారణే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

అంద్వత్వ నివారణే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ముద్ర తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిదిలోని 15వ వార్డ్ ప్రాధమిక పాటశాల లో శుక్ర వారం 2వ విడత కంటి వెలుగు శిబిరాన్నీ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్ సంకేపల్లీ రఘునందన్ రెడ్డి, కౌన్సిలర్  గిలత్తుల ప్రియలత రాము గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందత్వ నివారణ చర్యలో బాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. 18 సంత్సరాల పైబడిన అవసరం ఉన్న వారికి ఉచిత మందులు మరియు కళ్ళ అద్దాలు పంపిణీని చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమీషనర్ దండు శ్రీను, డాక్టర్ మల్లెల వందన, సిహెచ్ఓ మాలోతు బిచ్చు నాయక్, సంధ్యారాణి, ప్రవలిక, శ్రీలత, పూర్ణ శేఖర్, విజయ్, దనమ్మ, వార్డ్ ఆఫీసర్  సైదులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు,అర్.పి. వార్డ్ ప్రజలు పాల్గోన్నారు.