పెంచికల్ పహాడ్ లో బిఆర్ఎస్ బూత్ కమిటీల ఏర్పాటు

పెంచికల్ పహాడ్ లో బిఆర్ఎస్ బూత్ కమిటీల ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, భువనగిరి: మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామ బీఆర్ఎస్ బూత్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ గోపె నరసింహ ఆధ్వర్యంలో బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు 8 వార్డులలో ప్రతి వార్డుకు కన్వీనర్ కో కన్వీనర్ నియమించామన్నారు.

ఈ క్రమంలో గ్రామ కన్వీనర్ కొమురెల్లి వెంకటరెడ్డి, కో కన్వీనర్  బాల్ద రవి, ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సిలువేరు నాగరాజ్, గోపె రాము, చాట్ల ఎల్లయ్య, గోపె రమేష్, గోపె కర్ణాకర్, బాసాని క్రాంతికుమార్, గోపె మల్లేష్, చింతల సత్యనారాయణ, సిలువేరు శ్రీనివాస్, బాల్ద రాములు, చిన్నం సురేష్, పన్నాల సిద్ధారెడ్డి, చింతల సత్తి, సుబ్బురు శ్రీశైలం, సుబ్బురు కొండల్, గొలుసుల రమేష్, చిన్నం రాములు, సుబ్బురు గణేష్, చిన్నం మధు, బిఆర్ఎస్ నాయకులు సిలువేరు ఏసు, సిలువేరు  బిక్షపతి, సిలువేరు స్వామి, సిలువేరు భూములు, సిలువేరు నాగులు, గోపె బాలరాజ్, సిలువేరు మధు, సిలువేరు యాదగిరి, చాట్ల బిక్షపతి,  సిలువేరు సురేష్  తదతరులు పాల్గొన్నారు.