వినాయక మండపం వద్ద అన్నదానం.

వినాయక మండపం వద్ద అన్నదానం.

మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని 9 వ వార్డు జామచెట్ల బావిలో యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం భువనగిరి కి చెందిన నిర్మల హాస్పిటల్ ప్రొప్రైటర్ బీసు శ్రీకాంత్ గౌడ్, భవాని దంపతుల ఆర్ధిక సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, కౌన్సిలర్ డబ్బేటి విజయ రమేష్ ల చేతుల మీదుగా ప్రారంభించారు. అంతకుముందు గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు బీసు రాంబాబు ,నరేష్,సురేష్, బట్టు నరేష్ ,బీసు సాయికుమార్,సాగర్,రంజిత్, బీసు నరసింహ గౌడ్ నిర్మల ,దబ్బేటి సందీప్ ,మురళి,గనగాని గణేష్ తదితరులు పాల్గొన్నారు.