రాజ్​నాథ్​ వ్యాఖ్యలు

రాజ్​నాథ్​ వ్యాఖ్యలు
  • శాంతి, సుస్థిరతలకు భంగం
  • పాక్​ విదేశాంగ ప్రకటన విడుదల 

న్యూఢిల్లీ: భారత దేశ గౌరవ, ప్రతిష్ఠలను కాపాడుకోవడం కోసం నియంత్రణ రేఖ (ఎల్​వోసీ)ని దాటి వెళ్లగలమని భారత దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం గురువారం స్పందించింది. మంత్రి దుందుడుకు వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తాయని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని భారత్​ను హెచ్చరించింది.  దక్షిణాసియాలో వ్యూహాత్మక వాతావరణాన్ని రాజ్‌నాథ్ వ్యాఖ్యలు అస్థిరపరుస్తాయంది. కశ్మీరు, గిల్గిట్ -బాల్టిస్థాన్‌ల గురించి భారతీయ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదని వ్యాఖ్యానించింది. ఒకవేళ భారత్​ ఎల్​వోసీని దాటే పరిస్థితే వస్తే ఆ దురాక్రమణను తాము అడ్డుకుంటామని తమను తాము కాపాడుకోగలిగే సత్తా పాక్​ ఉందని స్పష్టం చేసింది. జూలై 26న కార్గిల్​ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​నివాళులర్పించిన అనంతరం ప్రసంగించారు. ఇందులో ఎల్​వోసీ దాటే విషయంపై కుండబద్ధలు కొట్టారు.