మెక్సికోలో భూకంపం

మెక్సికోలో భూకంపం

మెక్సికో: మెక్సికోలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్​ సెంటర్​ ఫార్​ సిస్మోలాజీ ధృవీకరించింది. ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. ఈ భూకంపం వల్ల నష్ట వివరాలను ఇంకా అధికారులు వెల్లడించలేదు. కాగా భూకంపం అర్థరాత్రి చోటు చేసుకోవడంతో ప్రజలంతా మంచినిద్దురలో ఉన్నారు. కొద్దిమంది మాత్రం భూమి కంపించడాన్ని చూసి పరుపరుగున తమ కుటుంబసభ్యులతోపాటు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మళ్లీ భూకంపం సంభవించొచ్చేమో అనే భయాందోళనలను వ్యక్తం చేశారు.