భారీగా పెళ్లిళ్లు

 భారీగా పెళ్లిళ్లు
  • రాజస్థాన్ అసెంబ్లీ పోలింగ్ నవంబర్​25 న 
  • ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం 

న్యూఢిల్లీ :  రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం మార్చింది. నవంబర్ 23న జరగాల్సిన పోలింగ్‌ను అదే నెల 25న నిర్వహిస్తామని సీఈసీ వెల్లడించింది.  రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం మార్చింది. నవంబర్ 23న జరగాల్సిన పోలింగ్‌ను అదే నెల 25న నిర్వహిస్తామని సీఈసీ వెల్లడించింది. కౌంటింగ్ మాత్రం ముందు చెప్పిన విధంగానే డిసెంబర్ 3న యథావిధిగా జరుగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నవంబర్ 23న రాజస్థాన్‌లో భారీగా పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్‌లు జరగనున్నాయి. దీనికి తోడు దేవ్ ఉతాని ఏకాదశి కూడా కలిసి రావడంతో నవంబర్ 23న పోలింగ్ జరిగితే ఓటింగ్ శాతం తగ్గుతుందని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల తేదీ మార్చాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో సీఈసీ సానుకూలంగా స్పందించింది. కాగా.. 200 సీట్లున్న రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. అశోక్ గెహ్లాట్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయనకు యువ నేత సచిన్ పైలట్ నుంచి ఈసారి సహకారం అందుతుందా లేదా అన్నది చూడాలి. 2018 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం నుంచి వీరిద్దరి మధ్య నిత్యం వివాదాలు నెలకొన్నాయి. తనకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదంటూ సచిన్ విమర్శిస్తూ వుండటంతో హైమాండ్ రంగంలోకి దిగి పరిస్ధితిని అదుపు చేసింది. అయితే అధికారంలో వున్న పార్టీకి ఎప్పుడూ రెండోసారి ఛాన్స్ ఇవ్వలేదు రాజస్థాన్ ఓటర్లు. ఈ సెంటిమెంట్‌ ఈసారి రిపీట్ అవుతుందని బీజేపీ భావిస్తోంది.