వర్షాలు పడాలని పాండవులకు పూజలు - బోనం వండి నాలుకతో నాకుతూ పూజలు

వర్షాలు పడాలని పాండవులకు పూజలు - బోనం వండి నాలుకతో నాకుతూ పూజలు

ముద్ర న్యూస్ రేగొండ: రేగొండ మండలం రావులపల్లి,గ్రామ శివారు ప్రాంతాల్లో కొలువైన   పాండవుల గుట్ట మీద రూపిరెడ్డీ పల్లి,గ్రామస్తులు వర్షాలు పడాలని పాండవులకు ప్రత్యేక పూజలు చేశారు. "వర్షాలు కురావాలి" పంటలు పండలి, అని పాండవుల గుట్టపై కి వెళ్లే మెట్లపై నీళ్లు చల్లుతు మెట్లకు బొట్లు పెడుతూ వానలు కురావాలి వాన దేవుడా అంటు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ పాండవులకు ప్రత్యేక బోనం వండి. బోనాలు సమర్పించారు. తరువాత గ్రామస్తలు. భక్తులు దేవుడి ప్రసాదాన్ని మోకాళ్ళ మీద నిలబడి ఆ ప్రసాదాన్ని నాలికతో నాకుతారు. తరతరాలుగా వస్తున్న ఆచారమని వారు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని ఈ ప్రాంత వాసుల ప్రగాఢ విశ్వాసం. నమ్మకం.