ప్రతి ఒక్కరూ పోలీసుల వ్యవహరించినప్పుడే డ్రగ్స్ నియంత్రణ - హుజరాబాద్ సిఐ

ప్రతి ఒక్కరూ పోలీసుల వ్యవహరించినప్పుడే డ్రగ్స్ నియంత్రణ - హుజరాబాద్ సిఐ

శంకరపట్నం ముద్ర జూన్ 26 : ప్రతి ఒక్కరూ పోలీసుల వలె వ్యవహరించినప్పుడే డ్రగ్స్  నియంత్రణ సాధ్యమవుతుందని  హుజురాబాద్ సిఐ సంతోష్ కుమార్ అన్నారు.శంకరపట్నం మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకొని కేశవపట్నం సబ్ ఇన్స్పెక్టర్ దేశ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హుజరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ గా మార్చడమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. మాదకద్రవ్యాలు అరికట్టేందుకు కృషి చేయాలని, ఈ వ్యసనాలకు యువత,విద్యార్థులు లోను కావద్దని ఆయన అన్నారు. ముఖ్యంగా గంజాయి,  వంటి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు.

ఈ డ్రగ్స్ సేవించడం వలన ప్రాణాలకు హాని కలిగిస్తుందని ఆయన తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నాక ఆ మత్తులో వారు ఏం చేస్తున్నారో తెలియక చట్ట వ్యతిరేక పనులకు ఒడిగడుతున్నారని, ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.