రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన  ఎమ్మెల్యే గండ్ర

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన  ఎమ్మెల్యే గండ్ర

ముద్ర న్యూస్ రేగొండ:   తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అందత్వ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించినట్లు దేశంలోనే ఆదర్శవంతమైన పథకమని ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి, అన్నారు.బుధవారం రేగొండ మండలం తిరుమల గిరి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పౌరులందరికీ కంటి పరీక్షలు,ఉచితంగా అద్దాలను మందులు,అందజేస్తారని తీవ్రమైన వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 25% మంది ప్రజలకు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, శుక్లాలు 43 శాతం, బాల్యంలో అందత్వం నాలుగు శాతం,నాలుగు శాతం, డయాబెటిస్ రేటినోపతి ఏడు శాతం, చూపు మందగించడం మూడు శాతం,నీటి కాసులు ఏడు శాతం తో బాధపడుతున్నారని, దేశంలో ఎక్కడి లేని విధంగా అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా కంటి వెలుగు పథకం ఒకటని,ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని సంపూర్ణ అందత్వ నిర్మూలన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ల రాణి మధుసూదన్ రెడ్డి ఎంపీటీసీ గంట గోపాల్ ఎంపీపీ పున్నం లక్ష్మి రవి జడ్పీటీసీ సాయిని విజయ తెరాస మండల అధ్యక్షులు అంకం రాజేందర్ పీ ఏ సీ ఎస్ అధ్యక్షులు నడిపెళ్లి విజ్జాన్ రావు  తెరాస సీనియర్ నాయకులు మేడమ్ ఉమేష్ గౌడ్ తెరాస నేతలు మైస భిక్షపతి పట్టేం శంకర్ గంజి రజిని కాంత్ ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ప్రజాప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు